Wholesale inflation | టోకు ద్రవ్యల్బోణం 13 నెలల గరిష్ఠానికి చేరుకున్నది. వార్షిక ప్రతిపదికన ఏప్రిల్లో 1.26శాతానికి పెరిగింది. మార్చిలో ద్రవ్యోల్బణం 0.53శాతంగా నమోదైంది. ఇందుకు సంబంధించిన డేటాను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. నిపుణులు టోకు ద్రవ్యోల్బణం రేటు ఒకశాతంగా అంచనా వేశారు. ధరల పెరుగుదల పెరుగుదల నేపథ్యంలో టోకు ద్రవ్యోల్బణం పెరిగినట్లుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్లో ఉల్లి ధరల వృద్ధి రేటు 59.75శాతం ఉండగా.. మార్చిలో 56.99శాతం ఉన్నది. బంగాళదుంప విషయానికి వస్తే వృద్ధి రేటు 71.97శాతం ఉండగా.. ఏప్రిల్లో 52.96 శాతంగా నమోదైంది.
క్రితం ఏడాదితో పోలిస్తే ఉల్లి ధరలు 5.54శాలతం తగ్గగా.. బంగాళదుంప ధరలు 30.56శాతం పెరిగాయి. ఆహారపదార్థాల టోకు ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 5.52శాతం పెరిగింది. మార్చిలో ఇది 4.7శాతం పెరిగింది. నెలవారీ ప్రాతిపదికన మార్చిలో 0.95శాతంతో పోలిస్తే ఏప్రిల్లో 1.94శాతం వృద్ధి చెందింది. ఏప్రిల్ నెలలో టోకు ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధానంగా ఆహార పదార్థాలు, విద్యుత్, ముడి పెట్రోలియం, సహజ వాయువు, ఆహార పదార్థాలు, ఇతర తయారీ వస్తువుల ధరల పెరుగుదల కారణమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఏప్రిల్లో ముడి పెట్రోలియం టోకు ద్రవ్యోల్బణం గత సంవత్సరం 1.64శాతంతో పోలిస్తే.. 4.97శాతానికి ఎగబాకింది. ప్రాథమిక వస్తువుల టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 5.01శాతానికి చేరింది. అంతకుముందు నెలలో ఇది 4.51శాతంగా ఉన్నది. ఈ ప్రాథమిక వస్తువుల్లో ఆహార పదార్థాలు, కూరగాయలు, ఖనిజాలుంటాయి. తయారీ ఉత్పత్తుల ధరలు అంతకు ముందు నెలలో 0.85 శాతం నుంచి 0.42 శాతం తగ్గింది. ఇంధనం, విద్యుత్ ధరలు మార్చిలో 0.77 శాతం పతనం కాగా.. ఏప్రిల్లో ఇందుకు వ్యతిరేకంగా 1.38 శాతం ఎగిసింది. ఇంతకు ముందు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను సోమవారం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. డేటా ప్రకారం.. రిటైల్ ద్రవ్యోల్బణం రేటు (CPI) వార్షిక ప్రాతిపదికన 11 నెలల కనిష్ఠ స్థాయి 4.83శాతానికి పడిపోయింది. అంతకుముందు నెలలో 4.85శాతంగా నమోదైంది.