న్యూఢిల్లీ : ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ ఏటా పలు మొబైల్ ఫోన్లకు సపోర్ట్‌ను తొలగించే క్రమంలో ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 49 ఫోన్లలో సేవలను నిలిపివేస్తోంది. కొన్ని ఐఫోన్ మోడల్స్‌తో పాటు పలు అండ్రాయిడ్ ఫోన్లలోనూ వాట్సాప్ పనిచేయదు. అయితే పాత, అవుట్‌డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అయ్యే మొబైల్ ఫోన్లపైనే వాట్సాప్ పనిచేయకపోవడంతో యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యాపిల్, శాంసంగ్, సహా పలు మొబైల్ ఫోన్లలో డిసెంబర్ 31 నుంచి వాట్సాప్ పనిచేయదని తొలుత గిజ్చైనా రిపోర్ట్ చేసింది.
డిసెంబర్ 31 తర్వాత ఆయా ఫోన్ యూజర్లు వాట్సాప్ నుంచి న్యూ ఫీచర్లు, సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు ఎలాంటి అప్డేట్స్ పొందరు. డిసెంబర్ 31 తర్వాత ఏయే ఫోన్లను వాట్సాప్ సపోర్ట్ చేయదో పరిశీలిస్తే..యాపిల్ ఐఫోన్ 5, యాపిల్ ఐఫోన్ 5సీ, అర్కోస్ 53 ప్లాటినం, గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్ జడ్‌టీఈ, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987 జడ్‌టీఈ, హెచ్‌టీసీ డిజైర్ 500, హువై అసెండ్ డి, హువై అసెండ్ డీ1, హువై అసెండ్ డీ2, హువై అసెండ్ జీ740, హువై అసెండ్ మేట్, హువై అసెండ్ పీ1,
క్వాడ్ ఎక్స్ఎల్, లెనోవా ఏ820, ఎల్జీ ఎనాక్ట్, ఎల్జీ లుసిడ్ 2, ఎల్జీ అప్టిమస్ 4ఎక్స్ హెచ్డీ, ఎల్జీ అప్టిమస్ ఎఫ్3, ఎల్జీ అప్టిమస్ ఎఫ్3క్యూ, ఎల్జీ అప్టిమస్ ఎఫ్5, ఎల్జీ అప్టిమస్ ఎఫ్6, ఎల్జీ అప్టిమస్ ఎఫ్7, ఎల్జీ అప్టిమస్ ఎల్2 11, ఎల్జీ అప్టిమస్ ఎల్3 11, ఎల్జీ అప్టిమస్ ఎల్3 11 డ్యూయల్, ఎల్జీ అప్టిమస్ ఎల్4 11, ఎల్జీ అప్టిమస్ ఎల్4 11 డ్యూయల్, ఎల్జీ అప్టిమస్ ఎల్5, ఎల్జీ అప్టిమస్ ఎల్5 డ్యూయల్, ఎల్జీ అప్టిమస్ ఎల్5 11, ఎల్జీ అప్టిమస్ ఎల్7, ఎల్జీ అప్టిమస్ ఎల్7 11 డ్యూయల్, ఎల్జీ అప్టిమస్ నిట్రో హెచ్డీ, మెమో జడ్‌టీఈ వీ956, శాంసంగ్ గెలాక్సీ ఏస్2, శాంసంగ్ గెలాక్సీ కోర్,శాంసంగ్ గెలాక్సీ ఎస్2, శాంసంగ్ గెలాక్సీ ఎస్3 మిని, శాంసంగ్ గెలాక్సీ ట్రెండ్ 11, శాంసంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్, శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 2, సోనీ ఎక్స్పిరియ ఆర్క్ ఎస్, సోనీ ఎక్స్పిరియ మిరో, సోనీ ఎక్స్పిరియ నియో ఎల్, వికో సింక్ ఫైవ్, వికో డార్క్‌నైట్ జడ్టీ ఈ జాబితాలో ఉన్నాయి.