న్యూఢిల్లీ, జూన్ 13: కోవర్కింగ్ సేవలు అందించే సంస్థల్లో అతిపెద్ద కంపెనీ అయిన వీవర్క్ ఇండియా.. తాజాగా హైదరాబాద్‌లో నూతన సెంటర్‌ను ప్రారంభించింది. ఇందుకోసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నది. 1,500 మంది కూర్చోవడానికి వీలుండే ఈ సెంటర్‌ను రహేజా మైండ్‌స్పేస్‌లో నెలకొల్పింది. ఈ సెంటర్ వచ్చే రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నది. అంతర్జాతీయ కోవర్కింగ్ సేవలు అందిస్తున్న ఈ సంస్థ..దేశీయ మార్కెట్లోకి 2017లో ప్రవేశించింది. ఇప్పటికే నగరంలో పలు సెంటర్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూపు, వీవర్క్ గ్లోబల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థకు హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, పుణెలలో 6.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కోవర్కింగ్ స్థలాలను నిర్వహిస్తున్నది.