Gold Smuggler-BSF Jawan | పశ్చిమ బెంగాల్ లోని ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్మగుల్డ్ బంగారం తీసుకువెళ్తున్న వ్యక్తి. బీఎస్ఎఫ్ జవాన్ ను డాగర్ తో గాయ పరిచాడు. ఈ ఘటన సోమవారం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. స్మగ్లర్ దాడి నుంచి జవాన్ తప్పించుకున్నాడని, కానీ స్మగ్లర్ బంగారంతో పారిపోయాడని ఆ వర్గాల కథనం. పశ్చిమ బెంగాల్ లోని సరిహద్దు జిల్లా నదియాలోని విజయ్పూర్ వద్ద స్మగ్లర్ తన నడుము చుట్టూ బెల్టుతోపాటు కట్టుకున్న బ్యాగ్ లో 22 బంగారం బిస్కెట్లు, ఎనిమిది బంగారం బార్లను తీసుకెళ్తున్నాడు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ అతడ్ని అడ్డుకుని తనిఖీ చేశాడు.
వెంటనే స్మగ్లర్ తన వద్దనున్న పొడవాటి కత్తితో దాడి చేసి పారిపోయాడని అధికారులు తెలిపారు. బీఎస్ఎఫ్ జవాన్ తన వద్ద ఉన్న రైఫిల్ తో కాల్పులు జరిపినా ఉపయోగం లేకపోయిందన్నారు. జవాన్ వేసుకున్న యూనిఫామ్ షర్ట్ భుజం వద్ద చినిగిందని తెలిపారు. సమీపంలో రైతులు పొలాల్లో పని చేస్తుండటంతో జవాన్ ఎక్కువ రౌండ్లు కాల్పులు జరుపలేదని వివరించారు. స్మగ్లర్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు కిలోల బంగారాన్ని కస్టమ్స్ లేదా రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులకు అప్పగిస్తామని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.