న్యూయార్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో టెక్ ప్రపంచంలో ఏఐ టూల్స్‌పై హాట్ డిబేట్ సాగుతోంది. చాట్‌జీపీటీ వంటి చాట్‌బాట్స్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఏఐ టూల్స్‌తో ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన నెలకొన్నప్పటికీ న్యూ టెక్నాలజీతో సరికొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రేపటి ఉద్యోగాలు : లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ జాబ్స్ పేరిట వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వైట్‌పేపర్ వెల్లడించింది.
ఈ రిపోర్ట్‌లో ఏఐ ద్వారా మూడు లేటెస్ట్ జాబ్ కేటగిరీలు ముందుకొస్తాయని తెలిపింది. ఏఐ యుగంలో ట్రైనర్లు, ఎక్స్‌ప్లెయినర్లు, సస్టెయినర్లని మూడు విభాగాల్లో సరికొత్త రోల్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ట్రైనింగ్ విభాగంలో పెద్దసంఖ్యలో ఏఐ ఉపాధి అవకాశాలను క్రియేట్ చేస్తుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను అభివృద్ధి చేసే క్రమంలో ఇంజనీర్లు, సైంటిస్టులకు విస్తృత అవకాశాలు లభిస్తాయి.
ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ రోల్స్ స్ధానంలో కస్టమ్ మైక్రోచిప్స్కు డిమాండ్ పెరిగేకొద్దీ ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు నూతన అవకాశాలు అందివస్తాయి. ఇక ఎక్స్ప్లెయినర్ల విభాగంలో ఏఐని యూజర్లకు చేరువ చేసే క్రమంలో యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్స్, పర్సనలైజ్డ్ ఏఐ అసిస్టెంట్స్, ట్యూటర్స్, కోచ్‌లకు అవకాశాలు పెరుగుతాయి. ఇక సస్టెయినర్ల విభాగంలో కంటెంట్ క్రియేటర్లు, ప్రాంప్ట్ ఇంజనీర్లు, డేటా క్యూరేటర్లు, ఎథిక్స్, గవర్నెన్స్ స్పెషలిస్ట్స్ వంటి నూతన ఉద్యోగ అవకాశాలు ముందుకొస్తాయి.
Read More :