crypto | 35 ఏండ్లకే రూ. 41 కోట్లు కూడబెట్టాలని స్కెచ్ : క్రిప్టో పెట్టుబడులతో రూ. 67 లక్షలు పోగొట్టుకున్న టెకీ
క్రిప్టోలో (crypto) పెట్టుబడులు పెట్టిన 22 ఏండ్ల గూగుల్ ఉద్యోగి ఏకంగా రూ. 67 లక్షలు పోగొట్టుకున్నాడు. రూ. 41 కోట్లు కూడబెట్టి 35 ఏండ్లకే రిటైర్ కావాలనే ఆలోచనతో క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసినట్టు గూగుల్ ఉద్యోగి వెల్లడించాడు.
న్యూయార్క్ : క్రిప్టోలో (crypto) పెట్టుబడులు పెట్టిన 22 ఏండ్ల గూగుల్ ఉద్యోగి ఏకంగా రూ. 67 లక్షలు పోగొట్టుకున్నాడు. రూ. 41 కోట్లు కూడబెట్టి 35 ఏండ్లకే రిటైర్ కావాలనే ఆలోచనతో క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసినట్టు గూగుల్ ఉద్యోగి వెల్లడించాడు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం ఆర్జించాలనే తపనతో తాను క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేసి పెద్దమొత్తం నష్టపోయానని ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువ టెకీ వాపోయాడు.
ఇధన్ గున్లీ అనే టెకీ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ రూ. 1.6 కోట్ల వార్షిక వేతనం పొందుతున్నాడు. తల్లితండ్రుల సూచనతో గున్లీ చిన్నవయసు నుంచే మదుపు చేస్తుండేవాడు. బాల్యం నుంచే ఖర్చులకు కళ్లెం వేస్తూ డబ్బును పొదుపు చేయడంపై దృష్టి సారించాడు.
అయితే నవంబర్ 2021 నుంచి జూన్ 2022 మధ్య తాను అతిపెద్ద ఆర్ధిక పొరపాటు చేశానని, ఈ సమయంలో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసి రూ. 67 లక్షలు నష్టపోయానని చెప్పుకొచ్చాడు. బిట్‌కాయిన్, ఇథీరియమ్, సిబా ఇను, డోగ్కాయిన్ వంటి పలు క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టానని తెలిపాడు. 2022 వేసవిలో బిట్‌కాయిన్ పతనమవడంతో నష్టాల పాలయ్యాడు. క్రిప్టో మార్కెట్ పతనమవడంతో అతడి పెట్టుబడులు తుడిచిపెట్టుకుపోయాయి.
Read More :
Mallikarjun Kharge | పండిట్ నెహ్రూను ప్రధాని మోదీ గుర్తుచేయడంపై మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్‌లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

