Ratan Tata| ఆర్కెటెక్ కావాలనుకున్నా.. కానీ ఇలా గుణపాఠాలు నేర్చుకున్నా..
Ratan Tata| టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. తన చిన్నప్పుడు ఆర్కిటెక్చర్‌గా స్థిరపడాలని కోరుకున్నారట.. కానీ తండ్రి మాట కోసం..

ముంబై: దేశంలోని పేరెన్నికగన్నగొప్ప పారిశ్రామికవేత్తల్లో టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ( Ratan Tata ) ఒకరు.. దేశీయ కార్పొరేట్ దిగ్గజం టాటాసన్స్ సారధ్య బాధ్యతలు వారసత్వంగా చేపట్టి.. దాన్ని మరింత ఉన్న స్థాయికి తీసుకెళ్లిన రతన్ టాటా ఏం చదువుకున్నారో తెలుసా… ఆర్కిటెక్చర్..?
కుర్రాడిగా ఉన్నప్పుడు సాధారణ పిల్లల మాదిరిగానే ఆయన కూడా ఆర్కిటెక్చర్ కావాలని కలలు కన్నారట.. కానీ తండ్రి మాట జవదాటని రతన్ టాటా వ్యాపార రంగంలో ప్రవేశించడమే కాదు.. రికార్డులు నెలకొల్పారు. టాటా సన్స్‌ను నూతన శిఖరాలకు తీసుకెళ్లారు.
ఆర్కిటెక్చర్‌పై మనసు పారేసుకున్న రతన్
అయినా.. తనకిష్టమైన ఆర్కిటెక్చర్ వృత్తిని వదిలి.. వ్యాపారంలోకి అడుగిడటం బాధిస్తుందన్నారు. డిగ్రీ పొందినా వృత్తిలో కొనసాగకపోవడం బాధిస్తుంటుందని రతన్ టాటా చెప్పారు. తొలి నుంచి ఆర్కిటెక్ కావాలని కల కన్నారాయన. కానీ ఆయన తండ్రి మరోలా ఆలోచించారు.

ఇంజినీరింగ్ కోర్సు మధ్యలోనే వదిలేసి..
రతన్‌టాటాను ఇంజినీర్‌ను చేయాలని సంకల్పించారు. అందుకు అనుగుణంగా ఇంజినీరింగ్ కాలేజీలో చేర్చారు. కానీ ఆర్కిటెక్చర్‌పై మక్కువతో ఇంజినీరింగ్ కోర్సును మధ్యలోనే వదిలేశారు. 1959లో న్యూయార్క్ కొర్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్సులో చేరారు. పట్టా అందుకున్నాక కొలువు కూడా చేశారు.
ఆర్కిటెక్ నుంచి టాటా సన్స్ సారధ్యం..
లాస్ ఏంజిల్స్ కంపెనీలో ఆర్కిటెక్‌గా పని చేసిన రతన్ టాటాను విధి.. టాటా సన్స్ వ్యాపారంలోకి తీసుకెళ్లింది. తండ్రి బాధ్యతలు టేకోవర్ చేయాల్సి రావడంతో రతన్.. తనకిష్టమైన ఆర్కిటెక్ట్ వృత్తికి తిలోదకాలిచ్చారు.
ఆర్కిటెక్చర్ కోర్సుతో ఇవీ పాఠాలు
ఆర్కిటెక్నని చెప్పుకోవడానికి ఇబ్బంది పడకపోయినా.. దాంట్లోనే కొనసాగకపోవడం చింతించ దగ్గ విషయం అన్నారు. ఆర్కిటెక్చర్‌గా పని చేయకపోయినా.. ఆ కోర్సు నేర్పిన పాఠాలు.. తన వ్యాపారాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపకరించాయన్నారు.
సామర్థ్యం పెంపు.. చిక్కుల పరిష్కారం ఇలా..
నిర్దేశిత బడ్జెట్లోనే ప్రాజెక్ట్ పూర్తి చేయడంతోపాటు వ్యాపార నిర్వహణలో వచ్చే చిక్కులను ఎదుర్కొనే సామర్థ్యం ఆర్కిటెక్చర్ కోర్సులో నేర్చుకున్నానని చెప్పారు రతన్ టాటా.
ఇవి కూడా చదవండి:
ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త చార్జీలు
గుడ్ న్యూస్.. ప్రత్యక్ష పన్ను వసూళ్లు రెట్టింపు.. ఎంతంటే..!:
కార్లపై ఇన్‌ఫుట్ కాస్ట్ దెబ్బ.. మహీంద్రా థార్ ధరెంతంటే?!
ఇంధన డిమాండ్.. జూన్‌లో రికవరీ.. ఎలాగంటే..!!
చౌకగా లాప్‌టాప్‌లు.. రూ.24 వేల లోపు రెడీ.. ఇవీ డిటైల్స్..
బ్యాంకింగ్ అవకతవకలకు చెల్లు.. అందుకు ఆర్బీఐ కంపల్సరీ లీవ్
జనాభా నియంత్రణ తప్పనిసరి: శరద్ పవార్
కరోనా నుంచి కోలుకున్నాడు.. ఎవరెస్ట్‌ను అధిరోహించాడు
మోదీ కేబినెట్లో 90 శాతం మంది కోటీశ్వరులే..
పద్మ అవార్డులకు మీరే నామినేట్ చేయండి.. ప్రజలను కోరిన ప్రధాని మోదీ
దిగివచ్చిన ట్విటర్.. ఫిర్యాదు అధికారిగా వినయ్ ప్రకాశ్ నియామకం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

