EPFO | మీరు ఏదైనీ ప్రయివేట్ సంస్థలో పని చేస్తున్నారా.. ఈపీఎఫ్‌వో (ఉద్యోగ భవిష్యత్ నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో మీకు సభ్యత్వం కావాలా.. ఇప్పటి వరకు మిమ్మల్నీ ఈఎఫ్వోలో సభ్యులుగా చేర్చలేదా.. అలా చేర్చాలంటే కనీసవేతన పరిమితి ఉన్నది. ఇప్పుడు రూ.15 వేల కనీస వేతనం ఉంటే ఈపీఎఫ్‌వోలో సభ్యత్వం తీసుకోవచ్చు. దీనిపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం. ఈ నిర్ణయం వల్ల కోటి మంది కార్మికులు, ఉద్యోగులకు సామాజిక భద్రత లభిస్తుంది.
గడువు ——————————- కనీస వేతనం
01 – 11 – 1952 నుంచి 31 – 05 – 57 రూ. 300
01- 06- 1957 నుంచి 30 -12 – 62 రూ. 500
31- 12 – 1962 నుంచి 10-12 -76 రూ.1000
11 – 12 – 1976 నుంచి 31- 08- 85 రూ.1600
01 – 09 – 1985 నుంచి 31 – 10 – 90 రూ.2500
01- 11 – 1990 నుంచి 30 – 09 -94 రూ. 3,500
01-10-1994 నుంచి 31-05-2001 రూ.5000
01-06-2001 నుంచి 31-08-2014 రూ.7500
01-09-2014 నుంచి ఇప్పటివరకు రూ.15 వేలు
ప్రస్తుతం ఈపీఎఫ్‌వోలో 65 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. ఉద్యోగుల భవిష్యనిధి చట్టం-1952లో అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈపీఎఫ్‌వోలో చేరడానికి కనీస వేతన అర్హతను చివరిసారిగా 2014లో సవరించారు. మొత్తం తొమ్మిది సార్లు సవరించారు. అధిక వేతనాలు ఉన్న వారితోపాటు అన్ని సెక్షన్ల ఉద్యోగులకు ఈ బెనిఫిట్ లభిస్తుంది.
ఈపీఎఫ్వోతోపాటు ఈఎస్ఐసీ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఉద్యోగులకు, కార్మికులకు మరో సామాజిక భద్రత అమల్లోకి తెచ్చింది. ఈఎస్ఐలో చేరడానికి కనీస వేతనం 2017కి ముందు వరకు రూ.15 వేలు. 2017 జనవరి నుంచి దీన్ని రూ.21 వేలకు పెంచేసింది.