న్యూఢిల్లీ, మే 27: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్…దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. నూతన గోల్ఫ్ జీటీఐ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ధరను రూ.53 లక్షలుగా నిర్ణయించింది. ప్రీమియం విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నూతన వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లీ తెలిపారు.
12.9 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.2 ఇంచుల డిజిటల్ కాక్‌పిట్, అన్ని కాలలను కంట్రోల్ చేసుకునే విధంగా టెక్నాలజీ, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 అడాస్‌తో పాటు మరిన్ని ఫీచర్స్‌తో ఈ కారును తీర్చిదిద్దింది. కేవలం 5.9 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ మాడల్ గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.