Vivo Y300 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై300 ప్లస్ ఫోన్ గత నెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. తాజాగా వివో వై300 ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. మూడు రంగుల ఆప్షన్లలో వివో వై300 ఫోన్ వస్తున్నది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ ప్రాసెసర్ తో గత నెలలో వివో వై300 ప్లస్ ఫోన్ ఆవిష్కరించారు. ఇక వివో వై300 ఫోన్ సోనీ ఐఎంఎక్స్ 882 పోర్ట్రైట్ కెమెరా ఉంటుంది. ఏఐ ఔరా లైట్, 80వాట్ల పాస్ట్ చార్జింగ్కు మద్దతుగా ఉంటుంది.
గత నెలలో ఆవిష్కరించిన వివో వై 300 ప్లస్ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ మోడల్ రూ.23,999లకు లభిస్తుంది. సిల్క్ గ్రీన్, సిల్క్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ (1080×2040 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 6ఎన్ఎం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. వర్చువల్ గా 8 జీబీ ర్యామ్ పెంచుకోవడంతోపాటు మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ విస్తరించొచ్చు. వివో వై300 ప్లస్ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండరీ షూటర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటది.