Vivo V40e | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వీ40ఈ (Vivo V40e) ఫోన్ ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. వివో వీ40, వివో వీ40 ప్రో ఫోన్లతో వివో వీ40ఈ ఫోన్ జత కలుస్తుంది. రెండు కలర్ ఆప్షన్లతోపాటు 6.77 అంగుళాల డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5,500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
వివో వీ40ఈ (Vivo V40e) ఫోన్ ఈ నెల 25 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరిస్తారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తోపాటు 6.77 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 3డీ కర్వ్డ్ డిస్ప్లే, హెచ్డీఆర్ 10+ సపోర్ట్, ఔరా లైట్తోపాటు ఇనిఫినిటి ఐ కెమెరా ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సోనీ సెన్సర్ విత్ 2ఎక్స్ పోర్ట్రైట్ మోడ్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఏఐ ఎరేజర్, ఏఐ ఫోటో ఎన్హాన్సర్ వంటి ఫీచర్లకు కెమెరా సెటప్ మద్దతుగా ఉంటుంది. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5,500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేస్తుందీ ఫోన్.