Vivo T4 Ultra | చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో తన టీ4 సిరీస్‌లో (Vivo T4 Ultra) సరికొత్త మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే T4, T4x 5G స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ వివో టీ4 అల్ట్రా 5జీ పేరుతో (Vivo T4 Ultra) యూజర్లకు పరిచయం చేసింది. 50 ఎంపీ కెమెరా, 5500 mAh బ్యాటరీతో బడ్జెట్ ధరలో అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ మొబైల్ ఫీచర్ల వివరాలు ఇవే..
ఈ సరి కొత్త ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల (16.94 సెంటీమీటర్లు) క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో మీడియాటెక్ 9300+ చిప్‌సెట్‌ను ఉపయోగించింది. అదేవిధంగా ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15 పై రన్ అయ్యే ఈ ఫోన్లో LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 921 ప్రైమరీ కెమెరా, 50ఎంపీ 3ఎక్స్ పెరిస్కోప్ లెన్స్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ ప్రియుల కోసం, ఈ ఫోన్లో 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీ ఉండనుంది.
ధర వివరాలు..
ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ. 34,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 36,999, 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. వివో ఇండియా ఈ-స్టోర్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో (ఆఫ్‌లైన్‌లో) ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ మెటియోర్ గ్రే, ఫీనిక్స్ గోల్డ్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
Also Read..
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
హైదరాబాద్‌లో ఆల్కార్గో గతి ఎయిర్ డెలివరీ సేవలు