ముంబై, జూన్ 10: లాజిస్టిక్, సరఫరా సేవల సంస్థ ఆల్కార్గో గతి లిమిటెడ్..డైరెక్ట్ ఎయిర్ సర్వీసులను మరో ఎనిమిది నగరాలకు విస్తరించింది. కేవలం 24 గంటల్లో డెలివరీ చేయడానికి ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఈ సర్వీసులను హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణె, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 34 కమర్షియల్ ఎయిర్‌పోర్ట్స్‌తో అనుసంధానం కావడానికి సంస్థ..ఎయిర్ ఎక్స్‌ప్రెస్‌తో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నది.