న్యూఢిల్లీ, జూన్ 10: దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి నాలుగు సంస్థలు సిద్ధమవుతున్నాయి. వీటిలో వ్యాటర్ ప్యూరిఫైర్ కంపెనీ కెంట్ ఆర్వో సిస్టమ్స్‌తోపాటు కారంతర ఇంజినీరింగ్, మంగల్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, విద్యా వైర్స్ల ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
వాటాల విక్రయం ద్వారా ఈ నాలుగు సంస్థలు కనిష్టంగా రూ.2,500 కోట్ల నిధులను సేకరించాలనుకుంటున్నాయి.