న్యూఢిల్లీ, ఆగస్టు 28: దీర్ఘకాలిక సరఫరా చేసే ఉద్దేశంలో భాగంగా బయోలాజికల్ ఈతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివో బయో టెక్నాలజీ శనివారం ప్రకటించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందం విలువ రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల మధ్యలో ఉండనున్నది. హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న వివో బయో టెక్..ప్రపంచవ్యాప్తంగా ఫార్మాస్యూటికల్స్, బయోటెక్ కంపెనీలకు డిస్కవరీ సేవలను అందిస్తున్నది.