హైదరాబాద్, మే 3: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.36 కోట్ల నికర లాభాన్ని గడించింది విష్ణు కెమికల్స్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.29 కోట్లతో పోలిస్తే 25 శాతం పెరిదింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.335.55 కోట్ల నుంచి రూ.338.65 కోట్లకు చేరుకున్నట్టు కంపెనీ సీఎండీ కృష్ణ మూర్తి తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1,406 కోట్ల ఆదాయంపై రూ.137 కోట్ల లాభాన్ని గడించింది.