న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశీయ మార్కెట్లోకి మరో విదేశీ ఎలక్ట్రిక్ వాహనం అందుబాటులోకి వచ్చింది. వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్..సరికొత్తగా ఏడుగురు కూర్చోవడానికి వీలుండే వీఎఫ్ ఎంపీపీని పరిచయం చేసింది.
ఈ కారు ప్రారంభ ధర రూ.24.49 లక్షలుగా నిర్ణయించింది. సింగిల్ చార్జింగ్‌తో 517 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారును దేశీయ కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా తయారు చేసినట్టు కంపెనీ సీఈవో తపాన్ ఘోష్ తెలిపారు.