హైదరాబాద్, మార్చి 19: వియత్నాం వెళ్లే విమాన ప్రయాణికులకు మరో సర్వీసు అందుబాటులోకి వచ్చింది. వియట్జెట్.. వియత్నాంకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. వారానికి రెండు రోజులు మంగళ, శనివారాల్లో ఈ సర్వీసు నడుపుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ప్రతి మంగళవారం వియత్నాంలోని హోచిమిన్ నగరంలో రాత్రి 7.40 గంటలకు బయలుదేరే వీజే-1803 విమాన సర్వీసు హైదరాబాద్కు రాత్రి 10.35 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 11.35 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి ఆ మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు (భారత్ కాలమానంకంటే వియత్నాం కాలమానం 1.30 గంటలు ముందుంటుంది) హోచిమిన్ సిటీకి చేరుకోనున్నది.