న్యూఢిల్లీ, మే 30: దేశీయ ఐటీ సంస్థ ఎల్‌టీఐమైండ్‌ట్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ దేబాషిస్ చటర్జీ అనూహ్యంగా వ్యక్తిగత కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కంపెనీ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న వేణు లంబు నూతన సీఈవో, ఎండీగా పదొన్నతి పొందారు. ఈ నియామకం శనివారం నుంచి అమలులోకి రానున్నట్టు కంపెనీ పేర్కొంది.
2019లో మైండ్‌ట్రీ సీఈవో, ఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఛటర్జీ.. ఆ క్రమంలో మైండ్‌ట్రీ.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్లో 2022లో విలీనమైంది.