న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: వీఈ కమర్షియల్ వాహన సంస్థ తాజాగా చిన్న స్థాయి కమర్షియల్ వాహన సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. తన తొలి వాహనాన్ని ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో ప్రదర్శించింది.
2 టన్నుల నుంచి 3.5 టన్నుల సామర్థ్యంతో కూడిన ఈ వాహనాలను త్వరలో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురాబోతున్నది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం లో విడుదల చేసేందుకు అవకాశాలున్నాయి.