హైదరాబాద్, సెప్టెంబర్ 15: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ వైభవ్ జ్యూవెల్లరీ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్కాబోతున్నది. రూ.270 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి సంస్థలో వాటాలను ఈ నెల 22 నుంచి 26 వరకు విక్రయించనున్నారు. షేరు ధరల శ్రేణిని రూ.204-215గా నిర్ణయించింది.
ఈ వాటాల విక్రయంతో సమకూరిన నిధులను కొత్తగా 8 షోరూంలను ప్రారంభించడానికి వినియోగించనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంస్థకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో 13 షోరూంలు ఉన్నాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలలకాలానికి రూ.508.90 కోట్ల ఆదాయంపై రూ.19.24 కోట్ల నికర లాభాన్ని గడించింది.