జెనీవా, మే 12: పరస్పర ప్రతీకార సుంకాలపై అమెరికా, చైనా వెనక్కి తగ్గాయి. తమ మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాన్ని 90 రోజులపాటు విరమిస్తున్నట్టు సోమవారం జెనీవాలో ఇరు దేశాల అధికార వర్గాలు ప్రకటించాయి. ఇదిలా ఉంటే అమెరికాలోకి దిగుమతయ్యే చైనా వస్తూత్పత్తులపై సుంకాలను 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించడానికి, అలాగే చైనాలోకి వచ్చే అమెరికా వస్తూత్పత్తులపై టారిఫ్లను 125 శాతం నుంచి 10 శాతానికి దించడానికి రెండు దేశాలూ అంగీకరించాయి.
దేశంలోకి వచ్చే అమెరికా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ప్రతీకార సుంకాలు వేస్తామని భారత్ సోమవారం ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రతిపాదించింది.