H-1 B Visa | ఆగస్టు 2 నుంచి మళ్లీ హెచ్-1 బీ వీసా పిటిషన్లు!
హెచ్-1 బీ వీసా పిటిషన్లు | ఆగస్టు రెండో తేదీ నుంచి విదేశీ ఐటీ నిపుణుల నుంచి హెచ్-1 బీ వీసాల కోసం ఫ్రెష్ అప్లికేషన్లను .....

H-1 B Visa | ఆగస్టు రెండో తేదీ నుంచి విదేశీ ఐటీ నిపుణుల నుంచి హెచ్-1 బీ వీసాల కోసం ఫ్రెష్ అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నట్లు అమెరికా తెలిపింది. 2022 ఆర్థిక సంవత్సర అవసరాలకు అనుగుణంగా ఈ వారం ప్రారంభంలో ఆమోదించిన రిజిస్ట్రేషన్లకు అనుగుణంగా తాజా అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది.
హెచ్-1 బీ వీసా దారులకు మరో చాన్స్ ఇలా
ఈ ఏడాది ర్యాండం ఎంపికలో అవకాశం లభించని వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నట్లు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ( US Citizen ship and Immigration services ) తెలిపింది. దరఖాస్తు దారుల కోసం రెండోసారి లాటరీ తీస్తామని వెల్లడించింది.
ఇలా కంప్యూటరైజ్డ్ లాటరీ డ్రా..
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కంప్యూటరైజ్డ్ లాటరీ ప్రక్రియలో సరిపడా వీసాలను ఎంపిక చేయలేదని పేర్కొంది. అందుకే మరోమారు లాటరీ తీయనున్నట్లు పేర్కొంది. దీంతో వీసాల కోసం ఎదురు చూస్తున్న వందల మంది ఇండియన్లకు మరోసారి హెచ్-1 బీ వీసాలు దక్కే అవకాశం ఉంది.
12.5 శాతం పెరిగిన వీసా దరఖాస్తులు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి వర్క్ పర్మిట్ కావాలని కోరుతూ హెచ్-1 బీ వీసా కోసం గత నెలలో యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీకి 3.08 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 2021తో పోలిస్తే ఈ ఏడాది 12.5 శాతం దరఖాస్తులు పెరిగాయి. ప్రతి ఏడాదిలో యూఎస్ ఇమ్మిగ్రేషన్ సంస్థ 87,500 దరఖాస్తులను ఎంపిక చేస్తుంది.
నవంబర్ 3 వరకు పిటిషన్లకు అనుమతి
అమెరికాలో అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఇప్పటికే సమర్పించిన అప్లికేషన్లపై ఈ నెల 28న ర్యాండం కంప్యూటరైజ్డ్ లాటరీ తీసినట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ తెలిపింది. వీటిపై దాఖలు చేసే పిటిషన్లను నవంబర్ మూడో తేదీ వరకు అనుమతిస్తారు. హెచ్-1 బీ పిటిషన్లను ఆన్లైన్లో దాఖలు చేయడానికి అనుమతించరు.
హెచ్-1 బీ పిటిషనర్లు తప్పనిసరిగా పేపర్‌పై పిటిషన్ సమర్పించాల్సి ఉంటుంది. 2022 హెచ్-1 బీ వీసా క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్‌తోపాటు అప్లికబుల్ రిజిస్ట్రేషన్ సెలెక్షన్ నోటీసుతోపాటు రాతపూర్వకంగా పిటిషన్లు ఇవ్వాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
బంగారానికి ఫుల్ గిరాకీ.. ఎంతంటే?!
సక్సెస్‌ఫుల్‌గా ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్.. 25.82 లక్షల ఐటీఆర్స్ దాఖలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- h-1 b visa
- India
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

