US Tariff | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను మరోసారి టార్గెట్ చేశారు. మిత్రదేశం అని చెప్పుకుంటూనే 50శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేపడుతుండడంతోపై ట్రంప్ 25శాతం అదనంగా సుంకాలు విధించారు. సుంకాలు అమలు చేసేందుకు బుధవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకాలు చేశారు. సుంకాలు ఆగస్టు 7 నుంచి అమలులోకి రానున్నాయి. అదనపు సుంకాలు 21 రోజుల తర్వాత అమలులోకి వస్తుంది. ట్రంప్ తొలి సుంకాలు అమలులోకి రావడానికి 14గంటల ముందు అదనంగా సుంకాలు విధించేందుకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. జులై 30న ట్రంప్ భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25శాతం సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పన్నుల ఆగస్టు 7 నుంచి అమలులోకి రానుండగా.. అదనపు సుంతకాలు ఆగస్టు 27 నుంచి అమలులోకి వస్తాయి. రష్యా నుంచి భారీగా చమురును కొనుగోలు చేస్తుందని.. తద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సహాయపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు సంతకాలు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం.. రష్యాపై ఉక్రెయిన్ దాడి కారణంగా మార్చి 8, 2022న కొన్ని దిగుమతులు, పెట్టుబడులను నిషేధించారు. ఏప్రిల్ 15, 2021న అమెరికా సైతం ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకాలు చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం.. రష్యా నుంచి ముడి చమురు, పెట్రోలియం, పెట్రోలియం ఇంధనం, సంబంధిత ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడాన్ని అమెరికాలో నిషేధించారు. రెండో ఉత్తర్వు ప్రకారం.. భారతదేశంపై సుంకాలు విధించే ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులో.. భారత ప్రభుత్వం ప్రస్తుతం రష్యన్ ఫెడరేషన్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిసింది. వర్తించే చట్టాల ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ భూభాగంలో భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై 25 శాతం అదనపు సుంకం విధించబడుతుంది. ఈ ఉత్తర్వులోని సెక్షన్ 3 ప్రకారం.. వినియోగం కోసం యూఎస్‌లోకి ప్రవేశించే, వినియోగం కోసం గోడౌన్ నుంచి తొలగించబడిన వస్తువులపై ఈ సుంకం వర్తిస్తుంది.
ఈ అదనపు సుంకం 21 రోజుల తర్వాత అంటే ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, ఈ మినహాయింపు ఓడరేవు నుంచి నౌకలో లోడ్ చేయబడిన, తుది రవాణా మోడ్‌లో 21 రోజుల్లోపు యూఎస్‌లోకి ప్రవేశించిన వస్తువులకు వర్తిస్తుంది. ఇతర దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్నాయో లేదో తెలుసుకునే పనిని అధ్యక్షుడు ట్రంప్ తన వాణిజ్య మంత్రికి అప్పగించారు. ఈ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ సోమవారం భారత్‌పై భారీ సుంకాలు విధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. భారతదేశం నుంచి అమెరికాకు పంపే వస్తువులపై సుంకాలు పెద్ద మొత్తంలో పెంచబోతున్నామన్నారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేసి, దానిని ఇతర దేశాలకు అమ్మి, దాన్నుంచి భారీ లాభాలను ఆర్జిస్తోందని ట్రంప్ ఆరోపించారు. గత వారం ట్రంప్ భారత దిగుమతులపై 25 శాతం సుంకాన్ని.. అలాగే రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసినందుకు ప్రతీకార సుంకాలను ప్రకటించారు.