వాషింగ్టన్, జనవరి 30: వరుసగా వడ్డీరేట్లను తగ్గించుకుంటూ వచ్చిన అమెరికా ఫెడరల్ రిజర్వు ఈసారి రేట్లను యథాతథంగా ఉంచింది.
ద్రవ్యోల్బణ గణాంకాలు పుంజుకుంటుండటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలసీల ప్రభావంతో వేచి చూసేదోరణిలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఈసారి రేట్లను యథాతథంగా ఉంచడానికి మొగ్గుచూపింది. గడిచిన ఏడాదికాలంలో రేట్లను 5.3 శాతం నుంచి 4.3 శాతానికి దించింది.