Trump Tariffs Effect | వాషింగ్టన్, ఏప్రిల్ 30: అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థకు బీటలు పడ్డాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికానికిగాను(జనవరి-మార్చి మధ్యకాలంలో) వృద్ధిరేటు 0.3 శాతంగా నమోదైంది. గడిచిన మూడేండ్లలో ఇదే తక్కువ స్థాయి వృద్ధిరేటు. 202 ప్రతీకార సుంకాల విధింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గుచూపడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, ముఖ్యంగా దిగుమతులు తగ్గుముఖం పట్టాయని తెలిపింది.
గతేడాది చివరి త్రైమాసికంలో నమోదైన 2.4 శాతం కంటే భారీగా తగ్గిందని తెలిపింది. ట్రంప్ సుంకాల విధింపుతో దిగుమతులు 5 శాతం పడిపోవడం వృద్ధిరేటు తగ్గడానికి ప్రధాన కారణమని తెలిపింది. దీంతోపాటు వినియోగదారులు ఖర్చులు తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనివ్వడం కూడా వృద్ధి పరుగుకు బ్రేక్లు వేశాయని వెల్లడించింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఎస్అండ్పీ 500 సూచీ 2 శాతం పడిపోగా, డౌజోన్స్ 702 పాయింట్లు లేదా 1.7 శాతం పతనం చెందింది.