న్యూయార్క్, జూన్ 15: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు గట్టి షాక్ తగిలింది. వాణిజ్య రహస్యాలను బయటపెట్టిందన్న కేసులో టీసీఎస్‌పై 194 మిలియన్ డాలర్లు(రూ.1,600 కోట్లకు పైమాటే) జరిమానా విధించింది అమెరికా డిస్ట్రిక్ కోర్ట్. తమ వ్యాపార రహస్యాలను బయటపెట్టిందని ఆరోపిస్తూ కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్..టీసీఎస్‌పై గతంలోనే కేసు నమోదు చేసింది. దీనిపై విచారించిన యూఎస్ కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.