TCS | భారత్ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాణిజ్య రహస్యాలు బయట పెట్టిందన్న కేసులో టీసీఎస్ మీద అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు రూ.1600 కోట్లు (194 మిలియన్ డాలర్లు) ఫైన్ విధించింది. తమ వ్యాపార రహస్యాలు బయట పెట్టిందని ఆరోపిస్తూ టీసీఎస్‌పై డీఎక్స్‌సీ టెక్నాలజీ సంస్థ (కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ – సీఎస్సీ) కేసు పెట్టింది. దీనిపై విచారించిన అమెరికా కోర్టు.. టీసీఎస్‌కు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. ఈ విషయమై ఈ నెల 14న కోర్టు ఉత్తర్వులు అందుకున్నామని టీసీఎస్ తన ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధమైంది. ఈ తీర్పు వల్ల తమ ఆర్థిక లావాదేవీలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని పేర్కొన్నది.