న్యూఢిల్లీ, అక్టోబర్ 29 : అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 7.3 శాతం ఎగబాకి 5.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. నాలుగో త్రైమాసికం(అక్టోబర్ నుంచి డిసెంబర్ నాటికి) ఆదాయం 5.27-5.35 బిలియన్ డాలర్ల మధ్యలో నమోదుకావచ్చునని కంపెనీ సీఈవో రవి కుమార్ ఎస్ తెలిపారు.
2022 నుంచి ప్రతిసారి అంచనాలకుమించి రాణిస్తున్నట్టు, ఈ సారి కూడా అంచనాలకు తగ్గట్టుగానే ఆర్థిక ఫలితాలు నమోదయ్యాయన్నారు.