
హైదరాబాద్, నవంబర్ 24: అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ ఎఫ్5.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 200మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో 2018లో ఏర్పాటు చేసిన సెంటర్లో 500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా.. తాజాగా మరో 450 మంది సిబ్బంది కూర్చోడానికి వీలుండే సరికొత్త డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సచ్చిదానందన్ తెలిపారు.