[24]7.ai | అమెరికా కేంద్రంగా పని చేస్తున్న కస్టమర్ ఎంగేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ [24]7.. హైదరాబాద్‌లో వచ్చే మార్చి నాటికి 2,500 మందిని, 2023 మార్చి నాటికి 3,300 మందిని నియమించుకోనున్నది. హైదరాబాద్‌లోని ఎన్ఎస్ఎల్ సెజ్‌లో [24]7 యూనిట్ పని చేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్ టీమ్.. కస్టమర్లకు సేల్స్, కస్టమర్ సర్వీస్, టెక్నికల్ సపోర్ట్ల్లో చాట్, వాయిస్ బేస్డ్ సర్వీసులు అందిస్తోంది.
గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల కస్టమర్లతో సేవలు అందిస్తున్నది. అందులో టెలికం, రిటైల్, టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాలు ఉన్నాయి. 2003లో హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విశాఖపట్నం పట్టణాల్లోనూ ఉద్యోగులను నియమించుకోనున్నట్లు [24]7 ఇండియా అండ్ అమెరికా చీఫ్ డెలివరీ ఆఫీసర్ అనిమేశ్ జైన్ తెలిపారు.