Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 7, 2025న మొదలైన ఈ సీజన్‌కు మరోసారి నాగార్జున హోస్ట్‌గా అలరించారు. ఈసారి స్పెషల్ గా రెండు హౌస్‌లు ఏర్పాటు చేశారు . ఒకటి మెయిన్ హౌస్, మరొకటి ఔట్ హౌస్. ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంపిక కాగా, వారిలొఓ 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్లు . ఈసారి ట్విస్ట్ ఏంటంటే.. కామనర్లను “ఓనర్లు”గా , సెలబ్రిటీలను “టెనెంట్లు”గా హౌస్‌ల్లోకి పంపారు. మెయిన్ హౌస్‌లో లగ్జరీలు ఉండగా, ఔట్ హౌస్‌లో లగ్జరీలు లేవు. సెలబ్రిటీలు వాటిని గెలుచుకోవాలంటే టాస్క్‌లు చేయాల్సిందే.
ఇక హౌజ్‌లోకి వెళ్లిన 15 మంది కంటెస్టెంట్స్ ఎవరెవరు అనేది చూస్తే..
1. తనూజ పుట్టుస్వామి (Celeb)
తన తండ్రికి చెప్పకుండా సినిమాల్లోకి వచ్చిన తనూజ, ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది.
2. ఫ్లోరా సైనీ (Celeb)
నరసింహ నాయుడు ఫేమ్ ఫ్లోరా, గతంలో ఎదుర్కొన్న వివాదాల నుంచి బయటపడి మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని బిగ్ బాస్‌కు ఎంట్రీ ఇచ్చింది.
3. పవన్ (Commoner – డీమాన్ పవన్)
బాడీ బిల్డర్, కామనర్ విభాగంలో మెరుపులు మెరిపించి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పుషప్స్ టాస్క్‌లో అదరగొట్టాడు.
4. ఇమ్మాన్యుయెల్ (Celeb)
జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇమ్మాన్యుయెల్, తన మిమిక్రీతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇప్పుడు హౌస్‌లో రచ్చ చేస్తానంటున్నాడు.
5. శ్రష్టి వర్మ (Celeb)
పుష్ప 2 కొరియోగ్రాఫర్, సోషల్ మీడియాలో జానీ మాస్టర్ పై చేసిన ఆరోపణలతో వైరల్ అయ్యిన శ్రష్టి, ఇప్పుడు హౌస్‌లో అడుగుపెట్టింది.
6. మాస్క్ మ్యాన్ హరీష్ (Commoner)
అగ్నిపరీక్షలో గుండు కొట్టించుకున్న హరీష్‌కి బిగ్ బాస్ షోలో గుండుతోనే ఉండాల్సిందే అన్న కండిషన్ ఉంది. తన ఆత్మవిశ్వాసం హైలైట్ అయ్యింది.
7. భరణి (Celeb)
సీరియల్స్, సినిమాల్లో విలన్ రోల్స్ చేసిన నటుడు భరణి, తన లాకెట్‌తో కూడిన సీక్రెట్‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
8. రీతూ చౌదరి (Celeb)
సోషల్ మీడియా సెన్సేషన్, తన అసలు పేరు వనం దివ్య. గతంలో 700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న ఈ నటి ఇప్పుడు బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టింది.
9. డీమాన్ పవన్ (Commoner)
మెయిన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన డీమాన్ పవన్, స్టేజ్ పై తన ఫిట్నెస్తో ఆకట్టుకున్నాడు.
10. సంజనా గాల్రానీ (Celeb)
వివాదాల మధ్య బిగ్ బాస్ హౌస్‌కు వచ్చిన సంజనా, తన జీవితంలో ఎదురైన కేసులపై స్పష్టత ఇచ్చింది. ఐదు నెలల పాపను వదిలి షోలోకి రావడం హైలైట్ అయ్యింది.
11. రాము రాథోడ్ (Celeb)
`రాను బొంబాయికి రాను` పాటతో పాపులర్ అయిన ఫోక్ సింగర్, డాన్సర్ రాము – ఇప్పుడు బిగ్ బాస్‌లో వినోదం అందించబోతున్నారు.
12. దమ్ము శ్రీజ (Commoner)
ఫుల్ ఎనర్జీతో స్టేజ్ పై ఎంట్రీ ఇచ్చిన శ్రీజ, “విన్నర్ అవుతా” అని ధీమాగా చెప్పింది. కామనర్‌గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.
13. సుమన్ శెట్టి (Celeb)
తెలుగు సినిమాలకు కొంత దూరంగా ఉన్న ఈ కామెడీ నటుడు, మళ్లీ రీఎంట్రీ కోసం బిగ్ బాస్‌కు వచ్చాడు.
14. ప్రియా శెట్టి (Commoner)
ఒక సాధారణ యువతి అయిన ప్రియా, తన జీవితంలో ఎదురైన కష్టాలని స్టేజ్ పై పంచుకుంది. నవైపు ఓట్లు రాబట్టాలని కోరింది.
15. మర్యాద మనీష్ (Commoner)
ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన కామనర్. శ్రీముఖి స్పెషల్ రిక్వెస్ట్ తో హౌస్‌లోకి వచ్చిన మనీష్, తన అభిప్రాయాలతో ఆకట్టుకున్నాడు.
ఇక హౌజ్ ని రెండు భాగాలుగా విభజించాఇరు. మెయిన్ హౌస్ – ఓనర్స్ (కామనర్స్):
ఇందులో
1. కళ్యాణ్
2. డీమాన్ పవన్
3. దమ్ము శ్రీజ
4. మాస్క్ మ్యాన్ హరీష్
5. ప్రియా
6. మర్యాద మనీష్ ఉన్నారు.
వీరికి లగ్జరీలు, సదుపాయాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే అగ్నిపరీక్షలో గెలిచి మెయిన్ హౌస్‌లోకి వచ్చారు.
ఔట్ హౌస్ – టెనెంట్లు (సెలబ్రిటీలు):
1. తనూజ పుట్టుస్వామి
2. సంజనా గాల్రానీ
3. ఫ్లోరా సైనీ
4. ఇమ్మాన్యుయెల్
5. రాము రాథోడ్
6. సుమన్ శెట్టి
7. భరణి
8. రీతూ చౌదరి
9. శ్రష్టి వర్మ
వీరికి ఎలాంటి లగ్జరీలు లేవు. టాస్క్‌లు చేసి వాటిని గెలుచుకోవాలి. నిజంగా టెనెంట్ లైఫ్ అనే మాటకు అర్థం తెలిసేలా చేస్తోంది బిగ్ బాస్ . ఈ సీజన్ ఘాటు యుద్ధం మొదలైంది. సామాన్యులు ఓనర్స్, సెలబ్రిటీలు టెనెంట్స్ అన్న కాన్సెప్ట్ తో ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు గేమ్ ఎవరిది? విజేత ఎవరవుతారు? ఏ ఇంటి పరిస్థితి ఏవిధంగా మారుతుంది? అన్నదే చూడాలి!