Maruti Suzuki Discounts | గత ఆర్థిక సంవత్సరంలో కార్ల సేల్స్ మెరుగైన గ్రోత్ నమోదు చేసుకున్న కార్ల తయారీ సంస్థలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదే ఒరవడిని కొనసాగించాలని భావిస్తున్నాయి. మరింత కర్బన ఉద్గారాల నియంత్రణకు కేంద్రం రెండో దశ బీఎస్-6 ప్రమాణాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఇన్పుట్ కాస్ట్ పెరిగిందంటూ పలు కార్ల తయారీ సంస్థలు ధరలు పెంచేశాయి. మరోవైపు కష్టమర్లను ఆకట్టుకునేందుకు ఎంపిక చేసిన మోడల్ కార్లపై డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. కార్ల విక్రయాల్లో మొదటి స్థానంలో కొనసాగుతున్న మారుతి సుజుకి.. ఈ నెలలో ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వాగన్-ఆర్, స్విఫ్ట్, సియాజ్, ఇగ్నీస్, బాలెనో మోడల్ కార్లపై డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. క్యాష్ అండ్ ఎక్సేంజ్ బోనస్‌లతోపాటు డీలర్లు స్పెషిపిక్గా ఇచ్చే డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది మారుతి సుజుకి.
దేశీయ మార్కెట్లో తమ వాటాను పెంచుకునేందుకు మారుతి సుజుకి తిరిగి ఆల్టో కే10 మోడల్ కారు తీసుకొచ్చింది. ఈ కారుపై గరిష్టంగా రూ.55 వేల ఆఫర్లు ఉన్నాయి. ఇందులో రూ.40 వేలు నేరుగా డిస్కౌంట్‌తోపాటు మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎంటీ) పెట్రోల్ వేరియంట్‌పై ఎక్సేంజ్ బోనస్ రూ.15 వేలు లభిస్తుంది. ఎంటీ సీఎన్జీ వర్షన్‌పై రూ.20 వేల డిస్కౌంట్‌తోపాటు రూ.15 వేల ఎక్చ్సేంజ్ బోనస్ పొందొచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ)పై కేవలం రూ.15 వేల ఎక్సేంజ్ బోనస్ మాత్రమే పొందొచ్చు.
ఎస్-ప్రెస్సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌పై రూ.30 వేల డిస్కౌంట్ ప్లస్ ఎక్సేంజ్ బోనస్ రూ.15,000 అందిస్తున్నది. సీఎన్జీ వేరియంట్‌పై రూ.20 వేల డిస్కౌంట్‌తోపాటు రూ.15 వేల ఎక్సేంజ్ బోనస్ ఆఫర్ చేసింది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) వేరియంట్‌పై కేవలం రూ.15 వేల ఎక్సేంజ్ బోనస్ అందిస్తున్నది.
సెలేరియో మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎంటీ) వేరియంట్‌పై గరిష్టంగా రూ.45 వేల డిస్కౌంట్ ప్రకటించింది. నేరుగా రూ.25 వేల డిస్కౌంట్‌తోపాటు రూ.15 వేల ఎక్సేంజ్ ఆఫర్ ప్రకటించింది. సీఎన్జీ వేరియంట్ ఎంటీ వేరియంట్ కారుపై నేరుగా రూ.30 వేలు, ఎక్సేంజ్ బోనస్ రూపంలో రూ.15 వేలు డిస్కౌంట్ ఇస్తున్నది. ఏఎంటీ వేరియంట్ కారుపై కేవలం రూ.15 వేల ఎక్సేంజ్ బోనస్ మాత్రమే అందిస్తున్నది.
వ్యాగన్-ఆర్ 1.0 లీటర్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎంటీ) పెట్రోల్ వేరియంట్‌పై నేరుగా రూ.30 వేల డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్ రూపేణా రూ.20 వేలు రాయితీ ఆఫర్ చేసింది. 1.0 లీటర్ల సీఎన్జీ ఎంటీ వేరియంట్ కారుపై నేరుగా రూ.15 వేల డిస్కౌంట్‌తోపాటు రూ.20 వేల ఎక్సేంజ్ బోనస్ అందిస్తున్నది. 1.2 లీటర్ల పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌పై నేరుగా రూ.25 వేలు, ఎక్సేంజ్ బోనస్ రూపంలో రూ.20 వేల డిస్కౌంట్ ప్రకటించింది. ఏఎంటీ వేరియంట్‌పై మాత్రం రూ.20 వేల ఎక్సేంజ్ బోనస్ ఇస్తున్నది.
డిజైర్ మోడల్ కార్లపై మారుతి సుజుకి ఎటువంటి డిస్కౌంట్లు ఆఫర్ చేయడం లేదు. కానీ రూ.10 వేల ఎక్సేంజ్ బోనస్ అందిస్తున్నది.
స్విఫ్ట్ మోడల్లో వివిధ వేరియంట్లపై గరిష్టంగా రూ.50 వేల వరకు డిస్కౌంట్లు అందిస్తున్నది. ఎల్ఎక్స్ఐ (Lxi), ఏఎంటీ (AMT) పెట్రోల్ వేరియంట్లపై రూ.10 వేల డిస్కౌంట్ ప్లస్ ఎక్సేంజ్ బోనస్ రూ.15 వేలు అందిస్తున్నది. వీఎక్స్ఐ (Vxi), జడ్ఎక్స్ఐ (Zxi), జడ్ఎక్స్ఐ+ (Zxi+) పెట్రోల్ వేరియంట్లపై నేరుగా రూ.30 వేల డిస్కౌంట్ ప్లస్ రూ.20 వేల ఎక్సేంజ్ బోనస్ ప్రకటించింది. సీఎన్జీ వేరియంట్‌పై కేవలం రూ.10 వేల డిస్కౌంట్ మాత్రమే లభిస్తున్నది.
మారుతి సుజుకి నెక్సా డీలర్‌షిప్‌ల వద్ద సియాజ్పై రూ.28 వేల వరకు రాయితీలు ప్రకటించింది. డెల్టా (Delta), జెటా(Zeta), అల్ఫా (Alpha) వేరియంట్లపై కార్పొరేట్ ఎక్సేంజ్ బోనస్‌గా రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3000 అందిస్తున్నది.
ఇగ్నీస్పై తన డీలర్‌షిప్‌ల ద్వారా మారుతి సుజుకి డిస్కౌంట్లు అందిస్తున్నది. మాన్యువల్, ఏఎంటీ వేరియంట్లపై రూ.25 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.4000 కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్ రూ.15 వేలు ఆఫర్ చేస్తున్నది.
మారుతి సుజుకి తన నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా బాలెనో మోడల్ కారుపై రాయితీలు అందిస్తున్నది. బైశాఖీ స్కీం కింద ఎంపిక చేసిన నగరాల పరిధిలో డెల్టా (Delta), జెటా (Zeta), అల్ఫా (Alpha) మాన్యువల్, ఏఎంటీ వేరియంట్లపై రూ.10 వేల డిస్కౌంట్ ప్రకటించింది.