న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: యూపీఏ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్చి నెల చివరినాటికి రూ.24.77 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని ఎన్పీసీఐ వెల్లడించింది. అంతక్రితం నెలతో పోలిస్తే 12.7 శాతం పెరిగాయని తెలిపింది.
ఫిబ్రవరిలో రూ.21.96 లక్షల కోట్లు లావాదేవీలు జరగగా.. క్రితం ఏడాది ఇదే నెలలో రూ.19.78 లక్షల కోట్లు జరిగాయి. విలువ పరంగా చూస్తే 25 శాతం అధికమయ్యాయని స్పైస్ మనీ ఫౌండర్, సీఈవో దిలీప్ మోదీ తెలిపారు.