SBI Alert | జీ-పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్, భారత్ పే.. ఇవన్నీ ఇన్స్టంట్ పేమెంట్ యాప్స్.. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల మయం.. మొబైల్ నంబర్ ఆధారంగా వచ్చే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఉచితంగా క్షణాల్లో మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒక్క మొబైల్ యాప్‌తో పలు బ్యాంకుల ఖాతాల లావాదేవీలు చకచకా చేసేయొచ్చు. మొబైల్ యాప్ పేమెంట్స్‌తో దేశీయ ఆర్థిక లావాదేవీల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. ఈ ఇన్స్టంట్ రియల్ టైం పేమెంట్ సిస్టమ్.. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్రారంభించింది. కానీ కరోనా మహమ్మారి ప్రభావంతో మొదలైన డిజిటల్ చెల్లింపులు వేగవంతం అయ్యాయి. ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులే.. గత నెలలో యూపీఐ చెల్లింపులు రూ.10.7 లక్షల కోట్ల మార్క్‌కు చేరాయి.
యూపీఐ చెల్లింపులకు పాపులారిటీతోపాటు ప్రజలను బురిడి కొట్టించి వారి ఖాతాల నుంచి మోసగాళ్లు నగదు స్వాహా చేస్తున్న ఘటనలూ పెరిగిపోయాయి. టెక్నాలజీ రోజురోజుకు మారిపోవడంతో సైబర్ మోసగాళ్లు ప్రజలను, అమాయకులను బురిడీ కొట్టించడానికి విభిన్న మార్గాలు అనుసరిస్తున్నారు. యూపీఐ ఫ్రాడ్లపై భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. తన ఖాతాదారులు సురక్షితంగా యూపీఐ లావాదేవీలు జరిపేందుకు టిప్స్ విడుదల చేసింది. `యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తున్న వేళ.. ఎల్లవేళలా ఆ యూపీఐ సెక్యూరిటీ టిప్స్‌ను గుర్తు పెట్టుకోవాలి. స్టే అలర్ట్ & #సేఫ్విత్ఎస్బీఐ Stay Alert & #SafeWithSBI` అని ట్వీట్ చేసింది ఎస్బీఐ. ఆ టిప్స్ ఏమిటో ఓ లుక్కేద్దామా..
Always remember these UPI security Tips while using or making UPI transactions. Stay Alert & #SafeWithSBI. #SBI #AmritMahotsav #CyberSafety #CyberSecurity #StayVigilant #StaySafe pic.twitter.com/LMR9E9nJnG
— State Bank of India (@TheOfficialSBI) September 27, 2022