UPI Payments | యూపీఐ పేమెంట్స్ లో వరుసగా మూడు నెలలో రూ.20 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. 2023తో పోలిస్తే గత నెలలో యూపీఐ లావాదేవీలు 35 శాతం వృద్ధి చెంది రూ.20.64 లక్షల కోట్ల పేమెంట్స్ నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) వెల్లడించిన డేటా ప్రకారం 14.44 బిలియన్ల లావాదేవీలు (45 శాతం వృద్ధి) నమోదయ్యాయి. సగటున ప్రతి రోజూ 46.6 కోట్ల లావాదేవీల్లో రూ.66,950 కోట్ల చెల్లింపులు జరిగాయి. గత మే నెలలో రూ.20.44 లక్షల కోట్లు, జూన్ నెలలో రూ.20.07 లక్షల కోట్ల యూపీఐ పేమెంట్స్ జరిగాయని ఎన్పీసీఐ వెల్లడించింది.
సీక్వెన్సియల్ ప్రకారం జూలైలో యూపీఐ లావాదేవీలు పరిమాణంలో 3.95 శాతం, విలువలో 2.84 శాతం పెరిగాయి. గత నాలుగేండ్లలో యూపీఐ లావాదేవీలు నాలుగు రెట్లు పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. 2019-20లో 12.5 బిలియన్ల లావాదేవీలు జరిగితే 2023-24లో 131 బిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తం డిజిటల్ పేమెంట్స్ పరిమాణంలో ఇది 80 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80.79 లక్షల కోట్ల విలువైన 55.66 బిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2023-24లో తొలిసారి 100 బిలియన్ల లావాదేవీల మార్కును దాటి 131 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. 2022-23లో 84 బిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి.
Nothing Phone 2a Plus | నథింగ్ మిడ్ రేంజ్ ఫోన్ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Gold Rates | బంగారం ధర మళ్లీ పైపైకి.. అందరి కళ్లూ అటువైపే..!
Realme | రియల్మీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు రియల్మీ 13 ప్రో.. రియల్మీ 13 ప్రో+ ఆవిష్కరణ
JioBharat J1 4G | మార్కెట్లోకి జియో మరో బడ్జెట్ ఫీచర్ ఫోన్ జియోభారత్ జే1 4జీ.. రూ.1,799లకే లభ్యం..!