న్యూఢిల్లీ : డిసెంబర్ 16న గ్లోబల్ మార్కెట్లో కియా కారెన్స్ ఎంట్రీ ఖరారు కావడంతో ఈ కారు ఫీచర్లపై హాట్ డిబేట్ సాగుతోంది. భారత్‌లో కియా కారెన్స్ సెవెన్ సీటర్ రానుందని కియా ఇండియా ఇప్పటికే ప్రకటించగా గతవారం కారు స్కెచ్లను విడుదల చేసింది.
కియా కారెన్స్ ఫీచర్ల విషయానికి వస్తే మూడు వరుసల కియా కారెన్స్ స్లీక్ ఫ్రంట్ గ్రిల్, స్వెప్ట్-బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, వై షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్, ఇంటీరియర్స్‌లో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టం, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ ఏసీ, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ వంటి ఫీచర్లతో రానుంది.
ఈ కారు ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి కియా ఇండియా ఎలాంటి వివరాలు వెల్లడించకున్నా కియా కారెన్స్ కనీసం కియా సెల్టోస్ 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగిఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కియా కారెన్స్ రూ 15 లక్షల నుంచి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.