ముంబై, డిసెంబర్ 4: దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రూపాయి చారిత్రక కని ష్ఠ స్థాయికా జారుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు కోల్పోయి 84.75 వద్దకు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం వల్లనే కరెన్సీలు పతనం చెందాయని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. 84.66 వద్ద ప్రారంభమైన రుఫీ-డాలర్ రేటు 64.65-84.76 స్థాయిలో కదలాడింది.
యూపీఐ లైట్ పరిమితి 5 వేలకు పెంపు
ముంబై, డిసెంబర్ 4: యూపీఐ లైట్‌కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి రిజర్వుబ్యాంక్ శుభవార్తను అందించింది. యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. అలాగే ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.500 నుంచి రూ.1,000కి సవరించింది. ఎలాంటి పిన్ నంబర్ లేకుండానే ఆఫ్‌లైన్‌లో మొబైల్ ద్వారా లావాదేవీలు జరిపేందుకుగాను ఆర్బీఐ గతంలోనే లైట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల కోసం యూపీఐ లైట్ వ్యాలెట్‌ను నగదు ఉంచాల్సి ఉంటుంది.