RBI | బ్యాంకింగ్ రంగంలో 47 శాతం పెరిగిన మోసాలు.. వాటి విలువెంతో తెలుసా?
ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ బ్యాంకింగ్ రంగంలో మోసాలు 46.7 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది.
- గత ఆర్థిక సంవత్సరం 47 శాతం ఎక్కువయ్యాయని ప్రకటించిన ఆర్బీఐ
- రూ.78,213 కోట్లకు బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు
RBI | ముంబై, మే 30: ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ బ్యాంకింగ్ రంగంలో మోసాలు 46.7 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. గురువారం విడుదల చేసిన రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం నిరుడు ఏప్రిల్ మొదలు ఈ మార్చి చివరిదాకా మొత్తం 36,075 మోసాలు జరిగాయి. అంతకుముందు ఏడాది కాలంలో 13,564 మోసాలే నమోదయ్యాయి. అయితే ఈసారి ఈ మోసాల విలువ రూ.13,930 కోట్లుగానే ఉన్నది. 2022-23లో మాత్రం రూ.26,127 కోట్లుగా ఉన్నట్టు ఆర్బీఐ గణాంకాలు చెప్తున్నాయి. ఇక ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఎక్కువగా చిన్నపాటి కార్డ్/ఇంటర్నెట్ మోసాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రం లోన్ పోర్ట్ఫోలియోల్లోనే అధికంగా మోసాలకు పాల్పడ్డారు.
రూ.78,213 కోట్లకు..
ఈ మార్చి ఆఖరు నాటికి బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల విలువ రూ.78,213 కోట్లకు పెరిగినట్టు ఆర్బీఐ తమ తాజా నివేదికలో తెలిపింది. ఏడాది క్రితం రూ.62,225 కోట్లేనన్న ఆర్బీఐ.. గత ఆర్థిక సంవత్సరం 26 శాతం పెరిగినట్టు చెప్పింది. సహకార బ్యాంకులుసహా దేశంలోని అన్ని బ్యాంకుల్లో పదేండ్లు, ఆపై కాలంగా ఖాతాదారులు తమ ఖాతాల నుంచి తీసుకోని డిపాజిట్లే ఇవన్నీ. వీటిని ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ చేస్తున్నారు. కాగా, సదరు డిపాజిట్ల సెటిల్మెంట్ల కోసం వాటికి చెందిన ఖాతాదారులను లేదా వారి వారసులు, నామినీలను వెతకాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచిస్తున్నది. ఇక గత ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ పరిమాణం 11.08 శాతం పెరిగి రూ.70.47 లక్షల కోట్లకు చేరిందని, అందుకే కేంద్ర ప్రభుత్వానికి మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రూ.2.11 లక్షల కోట్లను డివిడెండ్‌గా ప్రకటించామని ఆర్బీఐ తెలిపింది.
ఆర్బీఐ వార్షిక నివేదిక ముఖ్యాంశాలు
- ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 7 శాతంగా నమోదు కావచ్చని అంచనా.
- గత ఆర్థిక సంవత్సరం రూ.27,000 కోట్ల సావరిన్ గోల్డ్ బాండ్లను కొన్న మదుపరులు.
- రిజర్వ్ బ్యాంక్ వద్ద 822.10 మెట్రిక్ టన్నుల బంగారం.
- ప్రధాన ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చు. ఇదే జరిగితే ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం ఉంటుంది.
- ఈ ఏడాది మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న కరెన్సీలో 86.5 శాతానికి చేరిన రూ.500 నోట్ల వాటా.
- విదేశాల్లో రూపీ అకౌంట్లను తెరిచేం దుకు అనుమతి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- banks
- gdp
- rbi
- unclaimed deposits
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

