Uber ride with Whatsapp | మీరు ముఖ్యమైన పనులపై బయటకు వెళితే ఉబెర్.. ఒలా క్యాబ్స్.. బైక్స్‌పై రైడ్ చేస్తున్నారా.. అయితే ఉబెర్ టెక్నాలజీస్ మీకోసం తీపి కబురిందించింది. ఇక నుంచి వాట్సాప్ ద్వారా కూడా రైడ్ బుకింగ్ చేసుకోవచ్చు. భారత్‌లో మెసెంజర్ సర్వీస్ ద్వారా వాట్సాప్‌లో మీరు రైడ్ బుక్ చేసుకోవచ్చునని ఉబెర్ టెక్నాలజీస్ తెలిపింది. ఇందుకోసం ఉబెర్ టెక్నాలజీస్, మెటా ప్లాట్‌ఫామ్స్ అనుబంధ వాట్సాప్ మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.
కస్టమర్లు తమ వాట్సాప్ చాట్బొట్ ద్వారా ఉబెర్ మొబిలిటీ సర్వీసెస్‌కు మెసేజ్ పంపితే సరి. మీకు ఉబెర్ క్యాబ్ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. వాట్సాప్ మెసేంజర్ సర్వీస్ ద్వారా దేశంలో క్యాబ్ సర్వీస్ బుకింగ్ చేసుకోవడం తొలిసారి అని ఉబెర్ తెలిపింది. ప్రస్తుతానికి లక్నో కేంద్రంగా ఈ సేవలను ప్రారంభించింది. మున్ముందు దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొంది.
భారతీయులకు సౌకర్యవంతంగా, తేలిగ్గా ఉబెర్ ట్రిప్ అందుబాటులోకి తేవాలని తాము భావించామని ఉబెర్ బిజినెస్ డెవలప్మెంట్ సీనియర్ డైరెక్టర్ నందినీ మహేశ్వరి తెలిపారు. వాట్సాప్ యూజర్లు చాట్ ఇంటర్ఫేస్లోనే తమ పేర్లు నమోదు చేసుకుని రైడ్ బుక్ చేసుకోవచ్చు. రైడ్ చెల్లింపుల రశీదు కూడా పొందొచ్చు. వాట్సాప్ బుకింగ్ ఇన్ఫర్మేషన్లో డ్రైవర్ పేరు, లైసెన్స్, సదరు రూట్లో లొకేషన్ తదితర వివరాలన్నీ చేరుస్తారు. తొలుత ఇంగ్లిష్‌లోనే రైడ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మున్ముందు భారత్ భాషల్లోకి విస్తరిస్తామని ఉబెర్ తెలిపింది.
ఇంతకుముందు వాట్సాప్ మెసేంజర్ యాప్ ద్వారా జియోమార్ట్ ఆధ్వర్యంలో యాప్ గ్రాసరీ షాపింగ్‌ను ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతకుముందు రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మెటా ప్లాట్‌ఫామ్స్ (ఫేస్బుక్) పెట్టుబడులు పెట్టింది. మెటా అనుబంధ వాట్సాప్‌కు భారత్‌లో 50 కోట్ల మందికిపైగా వినియోగదారులు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం
అరుదైన రెండు తలల బల్లిని చూశారా ఎప్పుడైనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో