న్యూఢిల్లీ, జనవరి 11: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్లోకి నయా పల్సర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత మాడల్‌తో పోలిస్తే నూతన ఫీచర్స్‌తో తీర్చిదిద్దిన ఈ బైకు ధర రూ.1.84 లక్షలుగా నిర్ణయించింది. పాత మాడల్‌తో పోలిస్తే ఈ కొత్త బైకు రూ.10 వేలు అధికం.
హ్యుందాయ్ సరికొత్త మాడళ్లు
న్యూఢిల్లీ, జనవరి 11: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్..దేశీయ మార్కెట్లోకి నయా మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే మార్కెట్లో అంత్యంత ప్రజాదరణ పొందిన వెన్యూ, వెర్నా, గ్రాండ్ ఐ10 నియోస్లను మరింత ఆధునీకరించి మార్కెట్లోకి విడదుల చేసింది. టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చేసిన సంస్థ.. కంఫర్ట్, ఆధునిక ఫీచర్స్‌తో తయారు చేసినట్లు కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన వెన్యూ మాడల్‌లో స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 20.32 సెంటిమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, స్మార్ట్ కీతో పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, పూర్తిగా ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్‌తో తయారు చేసింది. వెర్నా రూ.12.37 లక్షల నుంచి రూ.15.26 లక్షల వరకు, గ్రాండ్ ఐ10 నియోస్ రూ.7.09-8.29 లక్షల లోపు, వెన్యూ రూ.9.28 -10.79 లక్షల లోపు లభించనున్నాయి.