Gold | ముంబై-హౌరా మెయిల్లో 2 కిలోల బంగారం తరలింపు.. మహారాష్ట్రలో వ్యక్తి అరెస్ట్
Gold | ముంబై-హౌరా మెయిల్లో 2 కిలోల బంగారం, 100 కిలోల వెండి తరలించిన వ్యక్తిని మహారాష్ట్ర-అకోలాలో అరెస్ట్ చేశారు.
Gold | మహారాష్ట్రలోని అకొలా రైల్వే స్టేషన్ వద్ద ఓ ప్రయాణికుడి వద్ద నుంచి రెండు కిలోల బంగారం, 100 కిలోల వెండిని అధికారులు జప్తు చేశారు. ముంబై-హౌరా మెయిల్ రైలులో వచ్చిన ప్రయాణికుడి నుంచి శుక్రవారం బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసు ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు తెలిపారు.
ముంబై-హౌరా మెయిల్ దిగిన సదరు ప్రయాణికుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. భారీ బరువుతో కూడిన బ్యాగ్తో వెళుతున్న ఆ ప్రయాణికుడిని బ్యాగ్ తెరవాలని ఆర్పీఎఫ్ అధికారులు కోరారు. అందుకు తిరస్కరించడంతో ఆయన్ను ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు.
తాను ఒక కొరియర్ సంస్థలో పని చేస్తున్నట్లు సదరు ప్రయాణికుడు తమ విచారణలో చెప్పాడని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. అతడి వద్ద బ్యాగ్లో 100 కిలోల వెండి బిస్కట్లు, రెండు కిలోల బంగారం బార్లు ఉన్నాయని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- gold
- maharastra
- seizure
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

