న్యూఢిల్లీ, మే 28: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ ఒకేసారి రెండు వాహనాలను విడుదల చేసింది. హ్యాచ్‌బ్యాక్ నెక్స్ జెన్ టియాగో, టియాగో ఈవీ ఉన్నాయి. వీటిలో రూ.4.69 లక్షల ప్రారంభ ధరతో టియాగో లభించనుండగా..రూ.6.99 లక్షల ప్రారంభ ధరతో టియాగో ఈవీ మాడల్‌ను తీసుకొచ్చింది. అలాగే వీటిలో సీఎన్జీ మాడల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈవీ మాడల్ బాస్ ధర రూ.4.69 లక్షలు+ బ్యాటరీ ఈఎంఐతో రూ.2.6కి కిలోమీటర్‌తో కస్టమర్‌కు అందిస్తున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర తెలిపారు.
దీనిపై లైఫ్‌టైమ్ బ్యాటరీ వ్యారెంటీని కూడా ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈవీ మాడల్ బ్యాటరీ కేవలం 18 నిమిషాల్లో 100 కిలోమీటర్లు ప్రయాణించే బ్యాటరీ రీచార్జి కానున్నదన్నారు. భద్రతా ప్రమాణాలు మెరుగుపర్చడంలో భాగంగా ఈ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ సిస్టమ్స్, వంటి నూతన ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.