న్యూఢిల్లీ, జనవరి 18: ప్రపంచంలో తొలి సీఎన్జీ స్కూటర్ అందుబాటులోకి రాబోతున్నది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టీవీఎస్..జూపిటర్ సీఎన్జీ మాడల్‌ను ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో ప్రదర్శించింది.
జూపిటర్ 125 సీఎన్జీ పేరుతో పిలవబడే ఈ స్కూటర్ కిలో సీఎన్జీకి 84 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. సీఎన్జీ ట్యాంక్‌తోపాటు రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంక్‌తో ఈ స్కూటర్‌ను తీర్చిదిద్దింది. 124.8 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ స్కూటర్ గంటకు 80 కిలోమీటర్లు వేగంతో దూసుకుపోనున్నది.