హైదరాబాద్, జూలై 15: టీవీఎస్ మోటర్.. రాష్ట్ర మార్కెట్లోకి సరికొత్త అపాచీ 160 సిరీస్ డార్క్ ఎడిషన్‌గా విడుదల చేసింది. వీటిలో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 మాడల్ ధర రూ.1,09,990, అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మాడల్ ధర రూ.1,19, 900గా నిర్ణయించింది.
ఈ సందర్భంగా కంపెనీ బిజినెస్ హెడ్ విమల్ సుంబ్లే మాట్లాడుతూ.. 160 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో రూపొందించిన ఈ రెండు మోటర్‌సైకిళ్లు 17.6 పీఎస్ 9250 శక్తినివ్వనున్నదని, యువతకు నచ్చే విధంగా వీటిని రూపొందించినట్లు చెప్పారు.