న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కేసీఎం అప్లయెన్సెస్‌కు టీటీకే ప్రెస్టీజ్ చెక్ పెట్టింది. స్వచ్చ్ ప్రెజర్ కుక్కర్‌ను కాఫీ చేసినందుకుగాను కేసీఎం అప్లయెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ప్రెస్టీజ్‌కు అనుకూలంగా తీర్పు వెల్లడైంది. టీటీకే ప్రెస్టీజ్‌కు చెందిన కుక్కర్లను కాఫీ చేయకుండా, తయారు చేయకుండా, విక్రయించకుండా కేసీఎంను నిరోధించింది.
ఇంపెక్స్ డ్రిప్లెస్ ఫ్రెషర్ కుక్కర్ డిజైన్‌తో సహా ఇలాంటి డిజైన్‌కు సంబంధించిన అన్ని సూచనలతోపాటు భౌతిక, వర్చూవల్ సైట్ నుంచి తక్షణమే తొలగించాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అలాగే కేసీఎం అన్ని ఈ-కామర్స్‌ల్లో విక్రయించడంపై నిషేధం విధించింది.