అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న మోదీ సర్కారు.. ఒకవేళ విఫలమైతే టారిఫ్ల మోత మోగనున్నది. ఇదే జరిగితే అన్ని రంగాల ఇండస్ట్రీలు కుదేలేనన్న అభిప్రాయాలు వినిపిస్తుండటం గమనార్హం. ఆయా రంగాలనుబట్టి అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై 50 శాతం నుంచి గరిష్ఠంగా 150 శాతం వర కు సుంకాలు పడవచ్చని చెప్తున్నారు మరి. కాగా, పలు ఇండస్ట్రియల్ గూడ్స్, ఆటోమొబైల్స్, ఈవీ, వైన్స్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తు లు, పాల ఉత్పత్తులు, యాపిల్స్ తదితరాలపై భార త్ సుంకాలను తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తున్నది.
ఇక ఉక్కు, అల్యూమినియంపై 50%, ఆటోపై 25% సుంకాలను దించాలని భారత్ కోరుతున్నది. అలాగే టెక్స్టైల్స్, రత్నాలు-ఆభరణాలు, తోలు ఉత్పత్తులు, దుస్తులు, ప్లాస్టిక్స్, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపండ్లపైనా సుంకాలను ప్రతిపాదిత ట్రేడ్ డీల్లో మినహాయించాలంటున్నది. కాగా, ట్రేడ్ డీల్ కోసం ఇప్పటికే ఐదుసార్లు కలిసిన ఇరు దేశాల ప్రతినిధులు.. ఆగస్టు 25 నుంచి భారత్లో ఆరోసారి చర్చించనున్నారు.