TRAI-Telcos | స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్లకు అడ్డుకట్ట వేసేందుకు టెలికం రెగ్యులరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్).. టెల్కోలకు మరొక నెల గడువు పొడిగించింది. వైట్ లిస్టెడ్ కానీ యూఆర్ఎల్స్, ఓటీటీ లింక్స్, ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీస్), కాల్ బ్యాక్ నంబర్లకు సంబంధించిన మెసేజ్లను నిలిపివేసే విషయమై టెలికం సంస్థలకు రిలీఫ్ కల్పించింది ట్రాయ్. టెలికం సంస్థలు – రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా- మెసేజ్ టెంప్లేట్స్, కంటెంట్లను ఈ నెల 31 లోపు రిజిస్టర్ చేసుకోవాలని ట్రాయ్ ఆదేశించింది. ఈ గడువు సరిపోదని, మరికొంత టైం పెంచాలని టెలికం సంస్థలు కోరారు.
తాజాగా మరోమారు గడువు పొడిగించిన ట్రాయ్.. అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. టెంప్లెట్స్, కంటెంట్ రిజిస్టర్ కాకుంటే మొబైల్ ఫోన్ యూజర్లకు సందేశాలు పంపడం నిలిపివేస్తామని పేర్కొంది. స్పామ్ కాల్స్, సందేశాలను నివారించడానికి, కంటెంట్ లేదా టెంప్లెట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి టెలికం కంపెనీలన్నీ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ బేస్డ్ టూల్స్ వినియోగించాల్సి ఉంటుంది. ట్రాయ్ వద్ద రికార్డులకు అనుగుణంగా లేని మెసేజ్ లను అక్టోబర్ నుంచి నిలిపివేస్తారు.
Stocks | రికార్డు గరిష్టాలకు స్టాక్ మార్కెట్లు.. 25 వేలు దాటిన నిఫ్టీ..!
Forex Reserves | జీవిత కాల గరిష్టానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!
Air India- Vistara | ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనానికి కేంద్రం ఓకే..
Canada – Immigration Policy | విదేశీ పర్యాటకుల ‘వర్క్ పర్మిట్’ నిలిపేసిన కెనడా.. కారణమిదే..!