Toyota Rumion MPV | మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) టెక్నాలజీతో రూపుదిద్దుకున్న రూమియాన్ ఎంవీపీ (Rumion MPV) కారును టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (Toyota Kirloskar Motors) ఆవిష్కరించింది. రుమియాన్ బేస్ ఎస్ వేరియంట్ విత్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ కారు ధర రూ.10.29 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ హై ఎండ్ వేరియంట్ ధర రూ.13.68 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఆసక్తిగల కస్టమర్లు రూ.11 వేలు చెల్లించి ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. వచ్చేనెల 8 నుంచి కార్ల డెలివరీ ప్రారంభం అవుతుంది.
రూమియాన్ ఎంవీపీ (Rumion MPV) ఆరు గ్రేడ్స్ – ఎస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (పెట్రోల్), ఎస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (పెట్రోల్), జీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (పెట్రోల్), వీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (పెట్రోల్), వీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (పెట్రోల్), ఎస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (సీఎన్జీ) వేరియంట్లలో వస్తున్నది.
ఎస్ ఎంటీ (పెట్రోల్) – రూ.10.29 లక్షలు
ఎస్ ఏటీ (పెట్రోల్) – రూ.11.89 లక్షలు
జీ ఎంటీ (పెట్రోల్) – రూ.11.45 లక్షలు
వీ ఎంటీ (పెట్రోల్) – రూ.12.18 లక్షలు
వీ ఏటీ ( పెట్రోల్) – రూ.13.68 లక్షలు
ఎస్ ఎంటీ (సీఎన్జీ) – రూ.11.24 లక్షలు
ఎర్టిగా మాదిరిగా టయోటా రుమియాన్ సెవెన్ సీటర్ కెపాసిటీతో వస్తున్నది. 1.5 – లీటర్ల కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తుంది. పెట్రోల్, పెట్రోల్ ప్లస్ సీఎన్జీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటది. లీటర్ పెట్రోల్‌పై 20.51 కి.మీ, కిలో సీఎన్జీపై 26.11 కి.మీ మైలేజీ ఇస్తుంది.
పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ గరిష్టంగా 6000 ఆర్పీఎం వద్ద 101 బీహెచ్పీ విద్యుత్, 4400 ఆర్పీఎం వద్ద 136.8 ఎన్ఎం టార్చి.. సీఎన్జీ వేరియంట్ ఇంజిన్ గరిష్టంగా 5500 ఆర్పీఎం వద్ద 88.63 బీహెచ్పీ, 4200 ఆర్పీఎం వద్ద 121.5 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
మారుతి ఎర్టిగా ఎంవీపీతోపాటు కియా కరెన్స్ మోడల్ కార్లతో టయోటా రూమియాన్ ఎంవీపీ పోటీ పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంవీపీ సెగ్మెంట్లో టయోటా ఇన్నోవా ఏండ్ల తరబడి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. తాజాగా కార్ల ప్రేమికులకు అత్యంత చౌక ధరలో ఎంవీపీ కారు రూమియాన్ తీసుకొచ్చింది.
టెక్నాలజీ మార్పిడి కోసం టయోటా కిర్లోస్కర్, మారుతి సుజుకి మధ్య గ్లోబల్ పార్టనర్ షిప్ ఉంది. ఒక సంస్థ మోడల్ కారు టెక్నాలజీని మరో సంస్థ తన బ్రాండ్ పేరుతో తయారు చేస్తుంది. మారుతి సుజుకి బాలెనోకు ఆల్టర్నేటివ్గా టయోటా గ్లాన్జా.. గ్లాన్జాకు ప్రత్యామ్నాయంగా మారుతి ఇన్విక్టో.. మిడ్ ఎస్యూవీ సెగ్మెంట్లో గ్రాండ్ విటారా (మారుతి), అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఆఫర్ చేస్తున్నాయి.