TCS & Reliance | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థలు..రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, విప్రో లబ్ధి పొందాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ నష్టపోయాయి. లబ్ధి పొందిన టాప్-5 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,01,145.09 కోట్లు పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రిలయన్స్ స్క్రిప్ట్‌లు భారీగా లాభ పడ్డాయి. గతవారం బీఎస్ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 112.57 పాయింట్లు లబ్ధి పొందింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,720.62 కోట్లు పెరిగి రూ.13,57,644.33 కోట్లకు చేరుకున్నది. మరోవైపు రిలయన్స్ ఎం-క్యాప్ రూ.21,035.95 కోట్లు పెరిగి మొత్తం దాని విలువ రూ.16,04,154.56 కోట్లకు పెరిగింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,656.95 కోట్లు పెరిగి రూ.7,83,779.99 కోట్ల వద్ద స్థిరపడింది. హిందూస్థాన్ యూనీ లివర్ ఎం-క్యాప్ రూ.16,000.71 కోట్లు లాభపడటంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,40,053.55 కోట్ల వద్ద ముగిసింది. విప్రో ఎం-క్యాప్ రూ.15,730.86 కోట్లతో రూ.3,82,857.25 కోట్లకు పెరిగింది.
మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎం-క్యాప్ రూ.18,619.95 కోట్లు కోల్పోయి రూ.7,97,609.94 కోట్లకు పడిపోయింది. ఇండ్ల రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,083.97 కోట్లు నష్టపోయి రూ. 4,58,838.89 కోట్లు, ఎస్బీఐ ఎం-క్యాప్ రూ. 9,727.82 కోట్ల నుంచి రూ.4,07,720.88 కోట్లకు పతనమైంది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,048.15 కోట్లు పతనమై మొత్తం ఎం-క్యాప్ రూ.4,13,546.63 కోట్ల వద్ద నిలిచింది. మరో ప్రైవైట్ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు రూ. 476.81 కోట్లు నష్టం కావడంతో దాని ఎం-క్యాప్ రూ.5,05,070.33 కోట్లతో స్థిరపడింది.